అరిపిరాల తారావళి; - రామ్మోహన్ రావు తుమ్మూరి

 11
ఇటనొక పాత శివాలయ
మటులనె వీరాంజనేయయాలయమున్ వేం కటపతి యాలయమాపై
దిటవుగ గిద్దెపెరుమాండ్ల దేవళముండెన్
12
పెద్ద గడియారమన్నది
ఒద్దికగా ఒంటి బురుజుదొక మేడొప్పున్
నిద్దముగ నడిమి యంగడి
గద్దెన నిలుచుండి కాల గణనము దెల్పున్
13
ఊరికి దక్షిణ ద్వారము
తోరణము కమాను యొప్పు  తోవకు నడుమన్
గుర్తు యది నిజాం పాలన
మా రజతోత్సవపు వేళ యది కట్టబడెన్
14
భారత్ రోజ్ తీరందాజ్
పేరెన్నిక గన్న హాళ్లు పేటల నొప్పెన్
తీరగు సినిమా లెన్నో
ఆ రోజులలోన ఆడె అలరగ జనముల్
15
దండిది వెండి పనిక్కడ
పండిన కంసాలి వారి పనితనమదియే
వెండిని  నాజూకు కళా
ఖండములుగ జేయువిద్య గాంచ ఫిలిగ్రీ
కామెంట్‌లు