ద్వారకాదాస్! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఖండేలా ఒక చిన్న రాజ్యం. దాని పాలకుడు ద్వారకాదాస్. చాలామంచివాడు.పశుపక్ష్యాదులను కూడా ప్రేమించే ఆతని ఖ్యాతి దూరతీరాలకు వ్యాపించింది.పొరుగున ఉన్న  మనోహరపుర్ రాజు శివసింహ్ కి అసలే కడుపులో మంట ఈర్ష్య అసూయ!దాస్ పేరు ప్ర ఖ్యాతులు విని మరీ కుళ్ళిపో యాడు.మొగల్ పాదుషాముందు ఎలాగైనా అతన్ని చిన్న పుచ్చాలని అవమాన పరచాలని విశ్వ ప్ర యత్నాలు చేయసాగాడు.ఒక సారి అతనికి  ఆఅవకాశం చిక్కింది.
మొగల్ పాదుషా అడవినించి ఒక క్రూరసింహాన్ని పట్టుకొచ్చి బోనులో బంధించాడు.జనం దాన్ని చూడటానికి వచ్చేవారు. ఒక రోజు దర్బార్ జనంతోకలిసి పాదుషా కూడా  ఆబోనుదగ్గర నించున్నాడు. శివ సింహ్  ద్వారకాదాస్ కూడా అక్కడే ఉన్నారు. సరదాగా పాదుషా అన్నాడు"ఈక్రూరమృగంతో మల్లయుద్ధంచేసే ధీరుడున్నాడా?"అందరిమొహాల్లో  కత్తి వాటుకి నెత్తురు చుక్క లేదు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న శివసింహ్  వెంటనే అన్నాడు" హుజూర్!కేవలం ద్వారకాదాస్ కి మాత్రమే  అలాంటి ధైర్యసాహసాలు ఉన్నాయి. ఆసింహం పీచం అణచగలిగేవాడు అతను ఒక్కడే". శివ సింహ్  కుటిల బుద్ధి తెలిసిన  దాస్ ధైర్యం గా అన్నాడు "జహాపనా!ఆజ్ఞాపించండి."సింహంతో మల్లయుద్ధంచేసే దాస్ ని చూడాలని జనమంతా ఎగబడ్డారు.సింహం గర్జిస్తూ  దాస్ దగ్గరకు వచ్చింది. అతను దాని కళ్ళల్లోకి సూటిగా చూశాడు. తనచేతిలోనిపూలదండను దాని మెడలో వేసి దాని మొహాన గంధం బొట్టు తీర్చిదిద్దాడు.అతని దృష్టి లో  అది నరసింహస్వామి!జనం అంతా నోరువెళ్ల బెట్టి చూస్తున్నారు. తోకాడిస్తూ పెంపుడు కుక్కలాగా అది దాస్ చుట్టూ తిరిగి తన బోనులోకి వెళ్లి పోయింది.
 "దాస్!నీశౌర్య పరాక్రమాలు
అసమానం.ఆసింహానికి నీవు అంటే అంత ప్రేమ ఆప్యాయత ఎలా కలిగాయి?"పాదుషా ప్రశ్నకు  దాస్ నవ్వుతూ ఇలా జవాబు ఇచ్చాడు"జహాపనా!ఇదంతా ఆభగవంతుని లీలయే సుమా!భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర పోటీని ఎవరికీ పెట్టకండి. నా అదృష్టవశాత్తు  ఆసింహం కళ్లల్లో మానవత్వం కనపడింది ప్రభూ!మనిషి కన్నా  క్రూరమృగం నయంఅనిపించింది. అందుకే ధైర్యం గా దాని మెడలో హారంవేసి నుదుట చందనం దిద్దగలిగాను." "ఏంటీ?దాని కళ్ళల్లో నీకు ప్రేమ  ఆప్యాయత  కనపడినాయా?" "అవును. ప్రేమ అందరిలో ఉంటుంది. మన మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటే  అది నిర్మల గంగాప్రవాహంలా  పొంగి పొర్లుతుంది.ఈవిషయంలో మనిషికి జంతువు కి తేడాలేదు. "ద్వారకాదాస్ ని అవమానించి అతని ప్రాణం తీయాలనుకున్న శివ సింహ్  సిగ్గు  అవమానం తో తలవాల్చాడు.సింహం కన్నా  తనెంత క్రూరుడో తెలుసుకుని  పశ్చాత్తాప పడ్డాడు.
కామెంట్‌లు