బాలలం!బాలికలం!!:--పి. విశాలాక్షి.సికింద్రాబాద్

బాలలం, బాలికలం మేము ఆనందాల హరివిల్లులం
రంగు రంగుల సీతాకోక చిలుకలం
కోతి కొమ్మచ్చి లో కోతులం
అల్లరిలో 
కోతులతొ  పోటి పడతాం
బాలలం, బాలికలం...

లేడి పిల్లలలా  
గెంతులు వేస్తాం
ఆటపాటలతొ 
చిందులు వేస్తాం
అందరికీ ఆనందం పంచుతాం
భేద భావం మరచి 
స్నేహం చేస్తాం
సైకిల్ టైర్ తో సరదాగా ఆటలాడుకుంటాం
చెట్లు చేమలతొ  మమేకమవుతాం

శాంతి కపోతాలం 
అవని అంతా తిరుగుతాం
సరిహద్దులు మాకు లేవంటాం
ప్రేమ పావురాలం మేము
ప్రేమను వెదజల్లుతాం
గుడి, మసీదు, చర్చి
అన్నీ మావే అంటాం
శాంతి కాముకులం 
ప్రపంచ శాంతికి గుర్తులం
బాలలం, బాలికలం మేము

కామెంట్‌లు