నన్ను మరిపించావు.....
నన్ను నువ్వై వెలిగించావు.....
చిన్న అణువునై నీలో ప్రవహించనా.....
నీ దానిగా ఏడు జన్మలు పుట్టనా....
ఏ జన్మ బంధమో నువ్వు.....
నా ఏడు జన్మలు నీకే ఇవ్వనా.....
నా కలలను మోసావు....
నా పసితనాన్ని బుజ్జగించావు.....
నన్ను నీలో అదుముకున్నావు.....
నేను నేనేనా......
లేక నేను నువ్వా.....
అర్థం కాని అనుభూతి సంకెళ్లు వేసావు.....
నువ్వు నా అపురూపమై.....
నాలో ప్రేమ పొంగువై.....
నన్ను నీకు ఇచ్చేసానులే.....
నీ తలపుల తలగడపై......
తల వాల్చిన.....
నీ అల్లరి దుప్పటి....
మేనికి కప్పిన.....
నీ కలలలో నిదురోతున్న....
నీకై బతుకుతున్న.....
నేను నీ ప్రతిరూపం
అల్లాడి వేణుగోపాల్
నేను నీ ప్రతిరూపం
అల్లాడి వేణుగోపాల్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి