పిల్లలకి నేర్పాల్సిన వి.;--తాటి కోల పద్మావతి గుంటూరు.

 తెలుగు భాష, మాతృభాషలో వారికి గట్టి పట్టు ఉండాలి. దానిని చిన్నతనం నుంచే శ్రీకారం చుట్టాలి.
మన సంస్కృతి, సంప్రదాయాలను తెలియచెప్పే పండుగలను వారికి దగ్గర చేయాలి.
విదేశీ సంస్కృతి కి దూరంగా ఉండేటట్లుగా కూడా చూసుకోవాలి. దానికి దగ్గర అయితే మన వాటికి దూరమయ్యే ప్రమాదం ఉంది.
స్త్రీలను గౌరవించడం నేర్పాలి. అదే వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది.
ఆడపిల్ల లైన, మగ పిల్లలు అయినా నా వంట నేర్పాలి. ఒక విద్య నేర్చుకోవడం ఎప్పటికీ ఉపయోగమే.
బి డి యం పోగొట్టి చొరవగా చురుకుగా అందరిలో కలసిపోయే స్వభావాన్ని పెంపొందించాలి.
అవకాశం ఉన్నప్పుడు అడగకపోయినా ఆపదలో ఎదుటి వారు ఉన్నప్పుడు సహాయపడటానికి తొలి అడుగు వారిదే అవ్వాలి.
కాలేజీలో స్కూల్ లలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు సంకోచించకుండా రక్తాన్ని దానం చేయాలి. ఆ చిన్న సహాయం ఏ పెద్ద ప్రాణం కాపాడవచ్చు.
సహాయం అందించడంలో ముందుంటారు కానీ తమకు అవసరమైనప్పుడు మొహమాట పడతారు కొందరు. దానికి దూరంగా పెంచాలి. ఇతరులకు సహాయ పడినట్లే సహాయము పొందాలి.
చుట్టుప్రక్కల జరుగుతున్న ప్రతి విషయాన్ని పరిశీలనగా చూడ మనాలి. అది ఇది వారి జీవిత గమ్యాన్ని ఎత్తులో నిలబెట్టడానికి తోడ్పడుతుంది.
కామెంట్‌లు