బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.:-సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 46)  మెదడు అత్యంత శక్తివంతమైనది.సాధనద్వారా దాన్ని విజ్ఞానం వైపు మరలిస్తే అద్భుతమైన విజయాలు సాధించవచ్చు.ఆ విజ్ఞానం కేవలం చదువు ద్వారానే వస్తుంది.
47) నిస్వార్థంగా చేసే సేవ మీలోని కాలుష్యాలను కడిగేస్తుంది.ప్రేమను పుట్టిస్తుంది.
48) గొప్ప సంకల్పబలం లేకపోతే మీకున్న ప్రతిభలన్నీ వృథాగా పోతాయి.
49) అద్భుతాలను సాధించడానికి మనపై మనకు నమ్మకమే మూలం.
50) లక్ష్యసాధన కోసం వెయ్యి ప్రయత్నాలైనా చెయ్యాల్సిందే.అప్పటికీ ఫలించకపోతే మరోప్రయత్నానికి సిద్ధం కావాలి.
(సశేషము)

కామెంట్‌లు