సభా కల్ప తరుo భజే! "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098
 👌మహాత్ముల సద్గోష్టి
     మహా జనుల సదస్సు
     "కల్ప తరువు" వంటిది
            ఆత్మ బంధువు లార!
      ( ఆత్మ బంధు పదాలు.,)
👌"సభ" అంటే.. వేద ఆగమ శాస్త్ర పండితులు, సంఘ శ్రేయోభిలాషులు.. మున్నగువారు; వేంచేసి యున్న సదస్సు! ఆ సభను "కల్పవృక్షం"గా అభివర్ణించారు, మన పెద్దలు.
👌"సభా కల్పతరువు" నకు కొమ్మలు, రెమ్మలు.. వేదములు, వేదాంగములైన ఉపనిషత్తులు.. మున్నగునవి. అది.. సకల శాస్త్రము లనే పుష్పముల సువాసనలతో కూడి యున్నది. ఆ దివ్య వృక్షము.. విద్వజ్జనులనే తుమ్మెదలతో.. శోభించు చున్నది. అట్టి మహాసభ యనెడు కల్ప తరువును త్రికరణ శుద్ధిగా సేవించాలి! అనగా, మనమంతా జ్ఞాన, విజ్ఞాన సముపార్జన కొరకు ఆశ్రయించాలి!
          🚩నీతి పద్య రత్నం
          ( తేట గీతి )
       వేద శాఖోపజీవన విలసితంబు,
       శాస్త్ర పుష్ప సమాయుక్త సదమలంబు,
       వివిధ పండిత షట్పద విభవ యుతము,
       అగు "సభా కల్ప తరువు"న కంజలింతు!!
          ( నీతి గీతాలు., విద్వాన్ బులుసు వేంకటేశ్వరులు.,)

కామెంట్‌లు