అక్షర మాలిక -బాల గేయాలు (ట గుణింతo );-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
 టమాటాలో సి విటమిన్ ఉంది  
టార్పాలిన్ పట్టాతో వానలో రక్షణ 
టిక్కెట్ లేని  ప్రయాణం నేరం 
టీచర్ అంటే జ్ఞానమిచ్చే గురువు 
టుమ్రీలు ఒక సాహితీ విధానం 
టూరు వెళ్తే జాగ్రత్తగా ఉండాలి 
టెక్కుగా మాట్లాడుట తప్పు 
టేకు చెట్ల పెంపకం ఆదాయం 
టైలరు వద్ద బట్టలు కుట్టించుదాo 
టొబాకో సేవించటం అనారోగ్యం 
టోపీతో ఎండావానలో రక్షణ 
టౌన్ లో జీవితం హడావిడినే 
టంకశాలలో నాణాల ముద్రణ!!


కామెంట్‌లు