అక్షర మాల - బాల గేయాలు (న గుణింతo );-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
 నవ్వుతూ బ్రతకాలి 
నావికులు సాహసవంతులు 
నిజం నిప్పు లాంటిది 
నీటిని వృధా చేయరాదు 
నువ్వుల ఉండలు రుచికరం 
నూనె తక్కువగా వాడాలి 
నృత్యం అద్భుతమైన కళ 
నెల్లూరులో పెన్నానది ఉంది 
నేటి నిజం ఒక దినపత్రిక 
నైలాన్ దారం పక్షులకు హాని 
నొచ్చుకునేలా మాట్లాడకు 
నోములు క్రమశిక్షణ కూడా 
నౌఖరుకూ మర్యాద ఇవ్వాలి 
నందనవనం మన బడి!!

కామెంట్‌లు