*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౨౮ - 028)
 కందం:
*సిరిఁగలిగినంత బంధూ*  
*త్కరములలో నెవరురారు ద్రవ్యాసూయా*
*పరతాశాపరులయి పదు* 
*గురు చూచి హసింతు రంచు గువ్వలచెన్నా!*
తా.: 
మన దగ్గర ఎక్కువ డబ్బు వున్నంత మాత్రం చేత చుట్టాలూ, స్నేహితులు అందరూ మన దగ్గరకు రారు. ఎందుకంటే, మన దగ్గర డబ్బు వున్నప్పుడు స్నేహితులు చుట్టాలు గనక వస్తే చూసే వాళ్ళు వచ్చిన వాళ్ళని దురాశాపరులు అనుకుంటారు ఏమో అని....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు