*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౩౩ - 033)
 కందం:
*ధర నాఁడుపడుచు సిరిచే*
 *నిరతంబును బొట్ట నించి నీల్గెడుఁ మనుజుం*
*డొరులెరుఁగకుండ రాతో*
*గురుతుగ నూఁతఁబడు టొప్పు గువ్వలచెన్నా!*
తా.: 
 తనకు ఏవిధమైన సంపాదనా మార్గాన్ని ఎంచుకోకుండా, తనతో పాటు పుట్టిన అక్క, చెల్లెలి సంపద మఖిద ఆధారపడి బ్రతుకును గడుపుతున్న మనిషి సమాజంలో ఏమాత్రము ఆదరణ, గౌరవం పొందలేడు.  ఇలా బ్రతుకు వెళ్ళబుచ్చే మనిషి, తనకు తాను ఒక పెద్ద బండరాయి ని కట్టుకుని ఎవరికీ తెలియకుండా ఎదైనా చెరువులో మునుగుట ఉత్తమమైన మార్గం....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*మనది అనాదిగా స్త్రీ సమూహాన్ని గౌరవం తో చూసుకునే సభ్యత గల సమాజం.  ఈ మన సమాజంలో అవకాశం వుంటే ఆమె ఉన్నతికి అన్ని విధాలా మనకు చేతనైన చేయూతనియ్యాలి.  కానీ, ఆమె సంపాదనతో తాను వృద్ధి చెందాలి అనుకోవడం అమానుషం, అమానవీయం.  నీవు సృష్టించిన ఈ మనిషికి తన తోబుట్టువులను గౌరవించుతూ, ఆదరణగా చూసుకుంటూ, వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ ఆడువారి ఉన్నతికి తోడ్పడే మంచి బుద్ది ని ప్రసాదించు పరమాత్మ ...*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు