*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౩౫ - 035)
 కందం:
*కాళ్ళం జేతులఁ జెమ్మట*  
*నీళ్ళవలర స్రవించుచుండ నిరతము మదిలోఁ*
*గుళ్ళక వకీలు నని తన*
*గోళ్ళం గొరుకుకిను ద్విజుడు గువ్వలచెన్నా!*
తా.: 
 తన కాళ్ళ వెంట, చేతుల వెంట చెమట నీరులా కారిపోతున్నా, ఏ మాత్రము బాధ పడకుండా నేను వకీలును కదా, అని తనకు తాను చెప్పుకుని తృప్తి పడతాడు బ్రాహ్మణుడు  ....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*ఈ చరాచర ప్రపంచంలో తనకంటూ గొప్పగా ఆలోచిచంచుకోకుండా, తన విద్యను, సమయాన్ని సమాజ హితం కోసం వెచ్చిస్తూ వుంటాడు, బ్రాహ్మణుడు.  ఈ ప్రయత్నంలో చెమటలు ధారలు కట్టినా పట్టించుకోడు. తను క్రతువు నిర్వహించిన ఇంటి యాజమాని మనస్ఫూర్తిగా ఇచ్చిన తాంబూలాన్ని తీసుకుని, పరమేశ్వరుని కి యాజమానికి మధ్య వకీలు ఉద్యోగం చేసి, యాజమాని పుణ్య సముపార్జనకు హేతువు అవుతాడు, పురహితము కోరే పురోహితుడు. ఈవిధంగా పరాత్పరునకు, పరమేశ్వర ఆత్మబంధువులకు అనుసంధానం చేసే పురోహితుని సంస్కారయుతంగా చూచుకోవలసిన బాధ్యత మనమందరం చక్కగా నిర్వహించే విధంగా మనల్ని నడిపించమని ఆ కాశీ విశ్వేశ్వరుని వేడుకుంటూ, అలా అన్నపూర్ణ సహాయంతో మనల్ని ఉద్ధరిస్తాడని నమ్ముతూ...!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు