*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౩౭ - 037)
 కందం:
*తన వారి కెంతగల్గినఁ* 
*దనభాగ్యమె తనకు నగును దగువాజులకున్*
*దనతోఁక చేత వీఁచునె?*
గుణియైనన్ ఘోటకంబు గువ్వలచెన్నా!*
తా.: 
 మన చుట్టాలకు పక్కాలకు ఎంత డబ్బు దస్కం సంపద వున్నా, ఆ సంపద మనది అవదు. ఎలా అంటే, ఎంతో గొప్ప జాతి గుర్రం అయినా, ఆ గుర్రానికి ఎంత పెద్ద కుచ్చు తోక వున్నా, తన తోటి గుర్రాలకు గాలి విసరలేదు కదా, అలా అన్నమాట .....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*ఎవరికి ఎంత ధార్మిక సంపద వున్నది అని చూసుకోకుండా, మనం పట్టించు కోకుండా మనధార్మిక సంపద ఎంత. పరమాత్మకు మనము ఎంత దూరం లేదా దగ్గర గా వున్నాము అని ప్రశ్న వేసుకుని, పరమాత్మకూ, ఆయన బంధువులు గా మనకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకుంటూ, మన ఆధ్యాత్మిక పెరుగుదల, ఎదుగుదల కోసం మన ప్రయత్నం, ప్రయాణం వుండాలి.  పరమేశ్వరుని వైపు మన అడుగులు నిలకడగా పడేటట్లు ఆ పరాత్పరుడు మనల్ని ఆశీర్వదించాలని,  ఆ సహకారం తోనే మన ధార్మిక అభివృద్ధి సాధ్యమవుతుంది అని నమ్ముతూ, ఆ దారిలో అంబాపతి మనల్ని తీసుకువెళ్ళాలి అని ప్రార్థిస్తూ...*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు