చంపకమాల -రుద్రవరం శివ కుమార్,10 వ తరగతి, జి.ప.ఉ.పా.వావిలాల, కరీంనగర్
 చంపకమాల
నజభజజ్జలరేఫలు పెనంగి దిశాయతి తోడ గూడినన్
త్రిజగదభిష్టుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్.
లక్షణములు
పాదాలు: 4
ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 21
ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర
యతి : ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము
ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
గణ విభజన
చంపకమాల వృత్త పాదము యొక్క గణ విభజన

I I I I U I U I I I U I I U I I U I U I U
పదము లబట్టి నందల కుబా టొ కయింత యులేక శూరతన్
ఉదాహరణ
పోతన తెలుగు భాగవతంలో 486 చంపకమాల వృత్త పద్యాలను వాడారు.
పదముల బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్
మదగజవల్లభుండు మతిమంతుడు దంతయు గాంత ఘట్టనం
జెదరగ జిమ్మె నమ్మకరిచిప్పలు పాదులు దప్పనొప్పఱన్
వదలి జలగ్రహంబు కరివాలముమూలముజీరె గోఱలన్.
సేకరణ:
రుద్రవరం శివ కుమార్
10 వ తరగతి
జి.ప.ఉ.పా.వావిలాల
కరీంనగర్

కామెంట్‌లు