*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦4౧ - 041)
 కందం:
*తెలుపైన మొగముగలదని*  
*తిలకము జుట్టును ద్యజించి తెల్లయిజారున్*
*దలటోపిఁగొనఁగ శ్వేతము* 
*ఖులలోనొకడగునె ద్విజుఁడు గువ్వలచెన్నా!*
తా.: 
చక్కని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడు తనకు తెల్లని ముఖము వుందని, శరీరము తెల్లగా వుందని, నుదిటిమీద విబూది, బొట్టు వదిలిపెట్టి, పిలక ముడి కత్తిరించుకుని, నెత్తి మీద తెల్లని టోపి పెట్టుకుని, పొట్టి నిక్కరు తొడుక్కుంటే ఇంగ్లీషు వాడు అయిపోతాడా. అవలేడు కదా.....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*పై పై వేషాలు ఎన్ని వేసినా, ఏ భాష మార్చినా మనిషి భగవంతుడు కాలేడు.  ఎటువంటి బాహ్యాడంబరములు చూపించకపోయినా, మాయలూ మర్మాలు చేయకపోయినా, మన మనసుని నిర్మలంగా వుంచుకుని, పరాత్పరుని చేరే ప్రయత్నం నిష్టగా నిర్దుష్టంగా చేస్తే పరమాత్మడు మనవాడే. అంతా మనమే. అన్నిటా మనమే. మనమే పరమాత్మ. పరమాత్మే మనము. మన చుట్టుప్రక్కల ఏమి జరుగుతున్నా, పరమేశ్వర పద్మపాదాలు వదలక నిలబడడమే మన కర్తవ్యం.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు