*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦4౨ - 042)
 కందం:
*వెల్లుల్లి బెట్టి పొగిచిన* 
*పుల్లని గోంగూరరుచిని బొగడఁగవశమా?* 
*మొల్లముగ నూనెవేసుక*
*కొల్లగ భుజియింపవలయు గువ్వలచెన్నా!*
తా.: 
పుల్లటి గోంగూర లో వెల్లుల్లి వేసిన కూరలో కొంచెం మంచి నూనె వేసుకుని మనసుకు ఆనందం వేసేటట్టుగా చక్కటి భోజనం చేస్తే కానీ బ్రహ్మాండమైన రుచి తెలియదు. అలాంటి కూరను అలాగే తినాలి.....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*పైన పట్టాభిరామకవి, గువ్వల చెన్నుడు చెప్పిన విధముగా రుచికరమైన వంటకాలు ఎన్నైనా తినవచ్చు కానీ జిహ్వ చాపల్యం వదిలించుకోలేము. జిహ్వ చాపల్యము వున్నంత వరకు, మన మనసు పరమాత్ముని వైపు వెళ్ళడానికి మొరాయిస్తూనే వుంటుంది.  కాబట్టి, జిహ్వ చాపల్యము తగ్గించుకుంటూ, దినచర్యను పూర్తి చేయడానికి అవసరమైన శక్తిని ఇచ్చే వరకు అవసరమైన మితాహారం తీసుకుని  జీవనం గడపాలి.  నెమ్మది నెమ్మదిగా మన మదిని కలియుగ వైకుంఠ వాసుని పాదాల చెంతకు చేర్చే ప్రయత్నం నిరంతరంగా, నిరంతరాయంగా, చేయాలి.  అలా మన మనసుని ఆ వేంకటేశ్వర స్మరణలో వుండేటట్లు గా అనుగ్రహించమని, అలమేలు మంగపతిని ప్రార్థిస్తూ... .*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు