*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦4౩ - 043)
 కందం:
*నీచున కధికారంబును*
*బాచకునకు ఆగ్రహంబుఁ బంకజముఖి*
*వాచాలత్వము బుధసం*
*కోచముఁగడు బాధకములు గువ్వలచెన్నా!*
తా.: 
 నలుగురికి ఉపోగపడని ఆలోచనలతో వునగన మనిషికి ఆదికారము వుంటము, వంటంట చేసే వానికి కోపము ఎక్కువగా రావటము, చక్కటి అందమైన స్త్రీ కి అనవసరముగా, ఎక్కవగా మాట్లాడే అలవాటు వుండటమూ, బుద్ధి మంతుడు, తెలివైన వాడు, పండితుడు అయిన వానికి ఏమాత్రమూ తన చుట్టూ జరుగుతున్న విషయాల మీద స్పందించే లక్షణము లేక పోవటమూ సమాజంలో అందరికీ బాధ కలిగించే విషయాలు......అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*సర్వకాల సర్వావస్థలందు సర్వజనులూ స్థితప్రజ్ఞత ప్రదర్శించడము అభిలషణీయమే. కానీ ఇది ఆచరణలో వుంచడంలో చాలా కష్టమైన విషయం.  అయితే, బుద్దిశాలి, ప్రజ్ఞాశాలి అయిన పండితుడు సమాజంలో నలుగురికీ అవసరమైన, ఉపయోగపడే విషయాలమీద తన స్పందన తెలియపరచాలి. అలా అవసరమైన మేరకు మాట్లాడక పోవడం కూడా సమాజానికి అన్యాయం చేయడమే అవుతుంది. ఈ లక్షణాన్ని కురు సభలో గాంగేయుడు, విదురుడు, మొదలైన విజ్ఞలు ప్రదర్శించడం వల్లనే పాచికలాట జరిగింది, పాంచాలి అవమానించ బడింది, మహాభారత యుద్ధం జరిగి 18అక్షౌహిణుల సైన్యం విగతజీవులయ్యారు.  అందుకని, ఓ పరమేశ్వర అవసరమైన మేరకు సత్వరమే స్పందించే లక్షణం మా మానవజాతికి ప్రసాదించు, కాశీపతీ.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు