*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦40 - 040)
 కందం:
*ధర నీపేరపురంబును*
 *గిరిజేశ్వర పాదభక్తి కీర్తియునీయు* 
*ర్వర నుతులుఁ గాంతువిదియొక* 
*గురువరముగ నెంచుకొనుము గువ్వలచెన్నా!*
తా.: 
చెన్నా, ఈ భూము మీద, నీ పేరుతో ఒక పట్టము వుంటుంది.  మహాశివుని మీద నీకు వున్న భక్త వల్ల నీకు మంచి కీర్తి, పొగడ్తలు పొందుతావు. పతమ గురువు అనుగ్రహం వల్లనే ఈ కీర్తి, పొగడ్తలు నీకు లభిస్తున్నాయి....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*పాంచ భౌతికమైన ఒక శరీరాన్ని ధరించిన వ్యక్తి పేరు మీద ఒక పట్టణం వెలసింది అంటే, అది కచ్చితంగా పరమగురు కటాక్షము, శివయ్య కరుణ వలననే సాధ్య పడుతుంది.  మానవ జన్మ లభించినందుకు నలుగురికి ఉపయోపడే పనులను చేస్తూ, ధార్మిక నడవడితో జీవనం సాగిస్తూ వుంటే, సమాజం మనలను గుర్తుంచుకునే అవకాశం పరాత్పరుడే కల్పిస్తాడు.  అందువల్ల నిత్యమూ కంజదళాక్షుని పద్మములవంటి పాదాలను మదిలో మరువక నిలిపుకునే సఫల ప్రయత్నం తప్పక చేయాలి.  అలా మనం సర్వేశ్వరుని పాద సేవలో సదా వుండేటట్లు ఆయనే అనుగ్రహించాలని సదా వేడుకుందాము.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు