"నీతితేటగీతులు"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
తే.గీ.
క్లిష్టపరిస్థితులెదురైనకీడుజేయ
కుండ,పరులకుమేల్జేసికువలయమున
సాగిపోవాలిమిత్రమాఆగిపోకు
దైవమేయిచ్చుశుభములుతప్పకుండ!!!

02.
తే.గీ.
కష్టనష్టాలనడుమనకలదుసుఖము
నచ్చినట్టిపనులజేయుముచ్చటగను
పరులకొరకునుబ్రతుకుటేపాడియవును
ఇంతకునుమించియేమున్నదీజగాన!!!

03.
తే.గీ.
ధర్మబద్ధంగజీవించికర్మలన్ని
నిర్వహణమొనరించియునీతితోడ
మసలుకొన్ననుచాలుగామాన్యులార
ప్రతిదిగమనించుదైవమ్ముప్రతిదినంబు!!!

కామెంట్‌లు