"భగవాన్ శ్రీసత్యసాయిబాబా జయంతి-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
తే.గీ.
సత్యసాయిబాబాగారుసముచితముగ
పుట్టపర్తిలోకొలువొందిపుణ్యకార్య
ములనుజేసినసద్భక్తవిలసితుండు
భక్తిభావమ్ముపెంచినశక్తియుతుడు!!!

02.
తే.గీ.
సకలప్రాణులపట్లనుసత్యసాయి
ప్రేమతత్త్వముపంచినప్రేమమయుడు
బోధనలతోడవివరించిపూజలొందె
"పుట్టపర్తిఆధ్యాత్మికపురములోన"!!!

03.
 తే.గీ.
సేవలందించెనిస్వార్థసేవగుణుడు
మార్గదర్శనమ్మొనరించెమానితుండు
నిత్యనూతనమైయొప్పెనిర్మలుండు
పుణ్యక్రతువులనెన్నెన్నొపూర్తిజేసె!!!


కామెంట్‌లు