"ప్రముఖఒగ్గుకథకళాకారుడు మాన్యశ్రీ మిద్దెరాములు వర్థంతి-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 
01.
తే.గీ.
"పుట్టెహనుమాజిపేటలోపుణ్యశీలి"
"గౌడకులములోప్రభవించెకౌస్తుభమణి"
"తనకుతానుగానీవిద్యతపనతోడ"
"ఒగ్గుకథనునేర్చెనునోపికగను"!!!

02.
తే.గీ.
"మిద్దెరాములుతెలగాణమేటివరుడు"
ఒగ్గుకథవిశిష్టతలనునుర్విజనులు
మెచ్చునట్లుప్రదర్శననిచ్చితాను
దానివిభవమ్ముచాటించెమానితముగ!!!

03.
తే.గీ.
"నెత్తిపైననుబోనమ్మునెత్తుకొనియు"
"ఆశువుగకథలనుజెప్పెనద్భుతముగ"
"మాటలందునహాస్యమ్ము ; పాటపాడి"
"సభలరంజింపజేసెనుసభ్యతగను"!!!

04.
తే.గీ.
"జానపదకళాబ్రహ్మ"గాచరితకెక్కి
ఒగ్గుకథకును"మిద్దె"నునొప్పునటుల
కట్టి,ప్రఖ్యాతిగాంచినకళలఱేడు
వారికర్పింతుభక్తితోవందనములు!!!
కామెంట్‌లు