*మణిపూసలు*;-*పోతుల చైతన్య భారతి*7013264464
దీనులను కాపాడగ
చేతనమై కదలంగ
అమ్మవారి అనుగ్రహం
దీపావళి దివ్యంగ.

అందలా హరివిల్లు
అవనిపై విలసిల్లు
అపురూపం ఈ వెలుగు
దీపావళి రంజిల్లు.

టపాసుల విన్యాసం
పిల్లలదె ఈ హాసo
పెద్దలకు కడు మోదం
సంతోషపు వికాసం.

ఇంటిలోన దీపాలు
ఆవరణం అందాలు
మనసంతా ఆనందం
బంధువులా సందడులు.

ఆకాశం తళతళలు
దీపావళి కాంతులు
సందడులే లోగిళ్లు
దిక్కులన్ని వెలుగులు.


కామెంట్‌లు