*మణిపూసలు*;-*పోతుల చైతన్య భారతి* 7013264464
బలహీనతకు రావణుడు
బానిసైన కామాంధుడు.
దివ్య శక్తులున్నా .!
అధోగతి పాలయ్యాడు.

పవిత్రసీత చెరబట్టి
పాపానికే ఒడిగట్టి
రావణుడు అoతరించే
అధర్మoగ నడవబట్టి.

ఈ కలియుగపు రావణులు
గల్లికొకరు కామాంధులు
దుర్మార్గుల దునుమాడగ
సత్యభామగ నెదురించు.

అజ్ఞానపు తిమిరాలను
కష్టాల నిశీదులను
అపర కాళిగ నెదురించు
అన్యాయ అధర్మాలను.

అందరు మహిళామణులు
అపర కాళీ జ్యోతులు
ఆసురులపైన సమరం
దుర్గామాత పోరులు


కామెంట్‌లు