-బాసటగా మారు(బాలగేయం);-*పోతుల చైతన్య భారతి* *హైదరాబాద్* 7013264464
పడవనెక్కి దాటు ఏరు
హాయి హాయిగా షికారు
పొలాలకై సాగు నీరు
పిల్లలంతా ఆడుతారు

తీయని పళ్ళుచూడనోరు
తినమని మనసు పోరు
పైరులెల్లా నీరు పారు
వరి నాట్లు నాటినారు

మేనుతాకే గాలి జోరు
ఆటలతో బాలలు జారు
పూలపై తుమ్మెదల హోరు
సంతసం మదిలో నింపేరు

సతతం హితం కోరు
ఆదర్శమవును తీరు
ప్రగతి బాటలో మీరు
దేశ బాసటగా మారు


కామెంట్‌లు