అక్కా చెల్లెల్లు (కథ )-తీగల సాత్విక 8వ,తరగతిజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలజక్కాపూర్, సిద్దిపేట జిల్లాపిన్ -502276
 గోపాలపురం అనే ఊరిలో  రాముడు,సీత అనే దంపతులు ఉన్నారు.వారిది నిరు పేద కుటుంబం .వారికి ఇద్దరు పిల్లలు.వారి పేర్లు లక్ష్మీ, కవిత.తల్లిదండ్రులు కవిత ను గారాబంగా చూసేవారు.లక్ష్మి ని చీటికీ మాటికి తిట్టేవారు.బడిలో లక్ష్మి కవిత కంటే బాగా చదివేది.కవిత బాగా చదివినట్లు నటించేది. ఉపాధ్యాయులు మాత్రం లక్ష్మి నే మెచ్చుకునేవారు. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు కవితనే మెచ్చుకున్నారు.
             పదో తరగతి పరీక్షల ఫలితాలలో లక్ష్మి స్కూల్ ఫస్ట్ వచ్చింది.కవిత ఫెయిలయింది.తల్లిదండ్రులు అప్పటినుండి ఇద్దరు బిడ్డలను సమానంగా చూడడం మొదలుపెట్టారు.లక్ష్మి చాలా సంతోషించింది
కామెంట్‌లు