రేపటి తొలిపొద్దులు;- కవిరత్న నాశబోయిన నరసింహ (నాన), ఆరోగ్యపర్యవేక్షకులు, చిట్యాల,నల్గొండ,8555010108
వారు...కలాం కన్న కలలు 
విశ్వకవి రవీంద్రుని స్వేచ్ఛా కలాలు
నవ్వుల పువ్వుల పున్నమి నాటి చంద్రులు
అభిరుచులు మారినా ఆకాంక్షలు వేరైనా
ఈ విశ్వంలో బాలలు తరగని జాతి సంపద!

ఊహల రెక్కలతో నింగిన ఎగిరే గువ్వలు
కల్లాకపట మెరుగని రంగుల పూమొగ్గలు
సంస్కృతీ సాంప్రదాయ వారసులు
జ్ఞాన కిరణాల రేపటి తొలిపొద్దులు
మరలిరాని మధుర జ్ఞాపకాల తీపి గుర్తులు!

నేటి బాల్యం బండెడు పుస్తకాల భారం 
అనురాగం ఆప్యాయత లందని ద్రాక్షలై
తాతా నానమ్మల కమ్మని కథలదృశ్యమై
ఆటపాట ఆనందానుభూతి లేని అయోమయం
బాల్యం వికసించినపుడే భవిత బంగారం!

ఆర్థిక అంతరాలు అసమానతలు 
వారు నడిచే మార్గానికి నిరోధకాలు
నిజంగా పెంపకం  ఓ సృజనాత్మక కళ
సభ్యత సంస్కారాల పోషకాలతో పెంచి
రేపటి కీర్తిపతాకాన్ని స్వేచ్ఛగా ఎగరనిద్దాం!


కామెంట్‌లు