అమృతమే;-డా || బాలాజీ దీక్షితులు పి.వితిరుపతి8885391722
 పెంచితే పెరగవు
విలువలు... పద్దతులు...
ఆచరిస్తేనే...ఆలంబనం అవుతాయి !
అంటిస్తే ...అంటుకోవు
మంచి,మమత,మానవత...
అవలంబిస్తేనే...పాతుకుపోతాయి !
చెపితేనే...వస్తాయా
నీతి...నిజాయితి...భక్తి
నిత్యం పాటిస్తేనే ... అతుక్కుపోతాయి !
చెత్తనంతా చుట్టూనింపి
ప్రవర్తన బాగలేదు అంటే ....
కడుపులూ అద్దెవే
ప్రేమలూ అద్దెవే
పాలూ  అద్దెవే
అందుకే ప్రతిఇంటా ప్రశాంతత లేని శాపాలు !
స్వార్దంలేని నమస్కారం ఎక్కడ
సంతృప్తిగల జీవితం 
రాజీపడే వ్యక్తిత్వం
నిగ్రహించే మనసుంటే 
బ్రతుకంతా అమృతమే !కామెంట్‌లు