దివ్యాంగులు కాదు వారు;-డా || బాలాజీ దీక్షితులు పి.వితిరుపతి8885391722
 పూర్ణత్వం నిండిన
స హృదయులు...వారు !
దివ్యత్వం నిండిన 
మహాపురుషులు...వారు !
నిత్యం స్ఫూర్తిని పంచే
మహనీయులు...వారు !
పట్టుదల గల
నిర్మల మనసులు...వారు !
స్థిత ప్రజ్ఞ నిండిన
మహోన్నత విజ్ఞులు...వారు !
మనసున్న 
మానవతామూర్తులు...వారు
లోపాలు జయించిన
కీర్తి కెరటాలు...వారు
దివ్యాంగులు కాదు వారు
దివ్యజ్ఞానులు వీరు


కామెంట్‌లు