శ్రితజన పోషక;-డా|| బాలాజీ దీక్షితులు పి.వితిరుపతి8885391722
 ఆకలి నుండి ఘోరకలి వరకు
వెన్నెల సుకుమారం నుండి
అగ్ని సెగల వరకు
మమకారం నుండి కోరికల కాసారం వరకు
ఆశలతపస్సు నుండి ఆశయాల కంకణం వరకు
నిండా నిండిన హృదయాలు
భాధాప్త శరాలలో
గుర్తుకొచ్చేది నీవే
జయకేతనాలు...
జగ్జనిత పాదాక్రాంత ధ్వనిలో
వినిపించేది...కనిపించేది నీవు
వేడుకుంటే చాలు...వేడుకై పొంగుతావు
సుఖాలలో గుర్తురాకున్నా
వరాలు కురిపించి
ఆటంకాలు తొలగించి
అందరిబంధువైన నీవు
శ్రితజనపోషకుడువు


కామెంట్‌లు