శీర్షిక..పరమార్ధం!; -ఎ.రాజ్యశ్రీ 8985035283
 జోహార్ జోహార్ జవహర్!
భరతాంబ మెడలోని కోహినూర్!
స్వరూపరాణి నోముపంట!
మోతీలాల్ కలలు మింటనంట
కమలహృదిలో అనురాగసుధలు కురిసెనంట!
బాల ఇందిరను లేఖలతో తీర్చిదిద్దావు!
నవభారతాన్ని ప్రగతి పధాన నడిపించావు!
పంచశీల పంచినా అధినేత!
అందుకో మాజోత!
నీఎదపై ఎర్రగులాబీ!
చిన్నారుల చాచాజీ!
తొలి ప్రధానిగా నిలిచావు
నీ కలం భారత్ చరిత్రను చేసింది శాశ్వతం!
పూలలా బాలలు కిలకిలా నవ్వాలి!
వారి భావికి బంగరు బాటలు వేయాలి!
బాలలపండుగ మాటల్లో కాదు
చేతల్లో చూపాలి!
మేరానయాబచపన్ లో
సుభద్రాకుమారీచౌహాన్
చూపిన బాల్యం మళ్ళీ 
పిల్లలలో చూసే భాగ్యం రావాలి!
పిల్లలపై వత్తిడి పెంచరు
స్మార్ట్ ఫోన్ ని ఆడుకోమని అందించరు!?
కొసమెరుపు...
అమ్మలూ!నర్సరీ నుంచి చదువు తో వారిని చిదపకండి!
డైరీలో సంతకం పెట్టి దగ్గరుండి 
ప్రతిదీ నేర్పండి!
అధ్యాపకులు పిల్లలపై వత్తిడి పెంచకండి!
అప్పుడే బాలలదినోత్సవంకి అర్ధం!పరమార్ధం!...స్వస్తి..

కామెంట్‌లు