బంజారాలు;-పాత్లావత్.పురందాస్ 9వ తరగతిZPHS నేరళ్ళపల్లిబాలానగర్ మండలంమహబూబ్ నగర్ జిల్లా
  రాబర్ట్ అనే ఒక యాత్రికుడు ఉండేవాడు. అతను అమెరికాకు చెందిన వాడు.రాబర్ట్ కు భారతదేశం అంటే చాలా ఇష్టం. సంవత్సరంలో ఒకసారి భారతదేశానికి వచ్చేవాడు. రాబర్ట్ భారతదేశంలో ఉన్న అన్ని మతాల వారిని కలిశాడు. ఈ సంవత్సరం భారతదేశంలోని లంబాడీల వారిని కలవాలని, వారి పద్ధతులను తెలుసుకోవాలని అనుకున్నాడు. భారతదేశంలో వివిధ మతాల వారి పద్ధతులను ఒక పుస్తకంగా ప్రచించాలని అనుకున్నాడు. లంబాడీల జీవిత చరిత్రను తెలుసుకోవాలనుకున్నాడు.
  తీరా ఒకరోజు రాబర్ట్ భారతదేశానికి వచ్చాడు.
భారతదేశంలోని తెలంగాణకు వెళ్లి అక్కడి లంబాడీలను కలిశాడు. తెలంగాణలోని బంజారాహిల్స్ దగ్గర ఒక వ్యక్తిని కలిశాడు. ఆ వ్యక్తి పేరు హాథిరామ్. ఆ వ్యక్తిని రాబర్ట్ మనసులో ఉన్న ప్రశ్నలు అడిగాడు. దానికి సమాధానం ఆ వ్యక్తి ఠక్కున చెప్పాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఒక లంబాడి. మొదట రాబర్ట్ లంబాడీలు ఎలా అవతరించారు? అని అడిగాడు. లంబాడీలు ముందు  రాజస్థాన్ లో అవతరించారు. భీమా ,ధర్మణి ల పుత్రుడైన సేవాలాల్ మహారాజ్ లంబాడీలను చైతన్యం చేసి, దేశమంతటా లంబాడీలను విస్తరించాడు. 
     ఆ కాలంలో నిజాం నవాబుకు ఈ విషయం తెలిసి, సేవాలాల్ ను భోజనానికి పిలిచాడు.సేవాలాల్, అమ్మవారి అనుగ్రహం కలవాడు. నిజాం నవాబు సేవాలాల్ తినే ఆహారంలో విషం కలిపాడు.కానీ అమ్మవారి అనుగ్రహం వల్ల సేవాలాల్ ఆ ఆహారాన్ని అమృతాహారం గా మార్చాడు. నిజాం నవాబు సేవాలాల ను చూసి ఆశ్చర్యపోయాడు. సేవాలాల్ కు బంజారా హిల్స్, హైదరాబాద్ ను బహుమానంగా ఇచ్చాడు నిజాం నవాబు. సేవాలాల్ మహారాజ్ ఆయన ప్రజలను కొండల పక్కన గ్రామం, ఎడమవైపు నీళ్లు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి అన్నాడు.
    ఆ తరువాత రాబర్ట్ బంజారాల పద్ధతులు సాంప్రదాయాలు ఏమిటి? అని అడిగాడు. హాథిరాం మా దాంట్లో తీజ్ మరియు దసరా పండుగ చాలా ఘనంగా చేస్తాము. మా లంబాడీలకు ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి. ఆడవాళ్లకు పేటియా,లంగా,ఓణి ఉంటాయి. మగవాళ్లకు ధోతి, శాలువా, రుమాలు ఉంటాయి. మా లంబాడీలు ఎక్కువగా జంతువులను పెంచుతాం. మా మతంలో వివిధ దేవతలు ఉంటారు. వారు తుల్జ ,హింగ్లా,మేరామ,మత్రాల్తో,కంకాళి ఇలా చాలా దేవతలు ఉంటారు .దసరా పండుగ నాడు తుల్జా భవాని నీ పూజిస్తాం. ఈ కాలంలో మా లంబాడీలకు గౌరవం తగ్గిపోయింది. ఈ విషయాలను విన్న రాబర్ట్ఆనందం కలిగి తన పుస్తకంలో బంజారాల గురించి ఎక్కువ విషయాలను రాశాడు. తన దేశంలో బంజారాల గురించి గొప్పగా చెప్పాడు. రాబర్ట్ బంజారాల పండుగలప్పుడు వచ్చి, ఆ పండుగలలో పాల్గొనేవాడు.
లంబాడీలను ,వారి పద్ధతులను గౌరవించేవాడు వారితో కలిసిమెలిసి ఉండేవాడు.

కామెంట్‌లు