చిత్రానికి పద్యాలు;-మమత ఐలకరీంనగర్9247593432
 కం.
భారిగ ముడిచిన కురులకు
చారెడు బంగారు పువ్వు చక్కగ బెట్టెన్
గీరెకు చుట్టిన విధముగ
మూరకు మిన్నైన మల్లె మొగ్గలనమరెన్ 
తే.గీ
నాటి కాలపు రూపంబు నారి కొప్పు
కొప్పు నడుమన పుత్తడి నప్పె పూవు
పూవ్వు లందున శ్రేష్టమై పొసగెమల్లె
మల్లె దండంత సిగచుట్టు మరులు గొలిపెకామెంట్‌లు