పద్యాలు ; -మమత ఐలకరీంనగర్9247593432
 దత్తపది:-నే నే నే నే
ఉ.
నేనను మాటలేదు చిరు నేరము లెన్నిన లేవుచింతలే
నేనిక నేనుగాను యని నెప్పుడు నామది జెప్పుచుండునే
నే నవకార్యసాధనకు నిక్కము వేడుదు దైవనీడనే
నే నిల తప్పువొప్పులను నిత్యము గానక సాగుజీవినౌ
దత్తపది:-నే నే నే నే
తే.గీ
నేనె యన్నను నావెంట నేదిరాదు
నేడు నాడైన నీడవు నీవెదేవ
నేటి మిత్రులై యెరుగరె నిక్క మెపుడు
నేతి మాటల మూటలో నిక్కమేది

కామెంట్‌లు