పద్యాలు ; -మమత ఐలకరీంనగర్9247593432
 న్యస్తాక్షరి:-వ.సుం.ధ.ర
తే.గీ
వసుద పులకించు సమయము వర్ష ఋతువు
సుందరంబైన చినుకులే నందనంబు 
ధరణి పచ్చని శోభతో పురము నేల
రమ్య మైనట్టి ప్రకృతినిలయము కాద

న్యస్తాక్షరి:- వ.సుం.ధ.ర
ఆ.వె
వనితలారుబయట వడియాలు బెట్టంగ
సుందరుండననుచు చూడవచ్చి
ధరలు జెప్పి మంచి వరహాల నందించ
రయముతోడ కొట్టు రమణిబెట్టె

కామెంట్‌లు