పద్యాలు ;-మమత ఐలకరీంనగర్9247593432
 సమస్యను పూరణ
*కనయవధాన పర్వమన కన్నుల పండువయే మహోదయా!*
చ.
ధనముకు హెచ్చుబాటవలె దండిగ జ్ఞానము విందుజేయగన్
వినుటకు నింపు పద్యములువీణకు మిన్నగ జెప్పుచుండగన్
జనగణ సందడంతటికి శారద దీవెన లిచ్చునట్లుగన్
*కనయవధాన పర్వమన కన్నుల పండువయే మహోదయా!*
 సమస్యా పూరణ
*దేవుడేమిటో మనిషికి తెలిసిపోవు*
తే.గీ
ప్రేమ మీరగా పిలువుము వేల్పునెపుడు
చల్ల నైనట్టి గుణముతో సరసనుండు
గరిమ గలిగిన గుర్తులో ఘనత నెరుగ
*దేవుడేమిటో మనిషికి తెలిసిపోవు*

కామెంట్‌లు