జవాబు వెతికే చిలకమ్మ(బాలగేయం)-- మమత ఐలహైదరాబాద్9247593432
బాలబాలికలంత బడిలోకి వెళ్ళంగ
రాగమాలిక రామచిలుక వచ్చి
దయగలుగు గుణమున్న దాతలెవ్వరనుచు
పశ్నించుచుండెను పదిలముగను

ముద్దునొక్కబాల  మునుముందు నకువచ్చి
చిలకపలుకులు విని చిరునగవుతో
నిన్ను మించిన వారు నుందురే లోకాన
దయగలగుణమున్న దాతనీవే

పంజరంలో పెట్టి పలుకమ్మ అనగానె
చక్కగా జ్యోష్య ము చెప్పుతావే
జాతకం చెప్పేటి జానకమ్మవు గదా
పరులహితముమేలనే పంచరంగులచిలక
నీకన్న దయాగుణంబెక్కడుండు

ఇచ్ఛలన్నీ మరచి ఇవ్వడం నేర్చావు
గుళికలిన్నిబెట్ట గున్నమావన్నావు
దయగల గుణమున్న దాతనీవు
స్వేచ్ఛనే మరిచావు చుట్టాన్ని అన్నావు


ఇదివిన్న చిలకమ్మ ఇదికాదు అనుకుంటు
చక్కగా ఎగిరెను సవ్వడులతో 


కామెంట్‌లు