పద్యాలు ; -మమత ఐలకరీంనగర్9247593432
 దత్తపది:- మంచము, లంచము, కంచము, కొంచము
కం.
లంచాని మంచంబనుచున్
వంచించెడి వారికెపుడు వచ్చును ధనమే
కొంచెము బుద్ధికి వణుకుచు
కంచము యీతీరు నింప కపటికి మెప్పౌ
కం.
లంచము నిచ్చిన వేదురు
మంచంబను సామెతగను మనసా యెపుడున్ 
కంచము నిండుగ బెట్టిన
కొంచెము కార్యంబు సాగు కోపములేకన్
ఉ.
లంచము నిచ్చుచున్ కరుగు రౌద్రమునాపుక కార్యదీక్షుడున్
మంచము నేలుచుండు తిని మౌనిగ లంచము బుచ్చుకోని యా
కంచము నిండెనిట్లుగద కష్టము కానిద ధర్మమే మరిన్
కొంచము బుద్ధిగల్గినను కోరవు లంచము నెప్పుడీగతిన్

కామెంట్‌లు