అత్తల దినోత్సవమట;-మమత ఐలకరీంనగర్9247593432
 ఆ.వె
అమ్మ ప్రేమయెంత యపురూపమైనను
అత్త కోరువృద్ధికంతు లేదు
లోకమంత యిట్టి లోతులన్ గాంచక
అత్త కోడలంచు నందు రెపుడు
ఆ.వె
నాటి యత్త లంత నమిలి మింగేసినా
నేటి తీరుమారె నెరుగరెవరు
యింటి దీపముగద యింపైన కోడలు
శ్రద్ధ బెట్టవలెను బుద్ధి తోడ

కామెంట్‌లు