రూబి లేక కెంపు;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

 ఆభరణాల్లో ఎర్రటి రాళ్ళు ఉపయోగించడం చూసే ఉంటారు.ఆ విలువైన ఎర్రటి రాళ్ళే కెంపులు లేక రూబీలు.
        ప్రశస్థమైన రూబీ రాయి విలువ చాలా ఉంటుంది. మియన్మార్ కు చెందిన పది కారెట్ల రూబీ రాయి సుమారు లక్షాడెభ్బై వేలు ఉంటుంది! రూబీ అనే పేరు ఎలా వచ్చిందంటే, లాటిన్లో రుబ్రమ్ అంటే ఎరుపు అందుకే దీనిని రూబీ అని అంటారు. 19 వ శతాబ్దంలో మాత్రమే దీని విలువను గుర్తించి ఉత్తమ తరగతి రాళ్ళలో  చేర్చారు.
       జెమాలజిస్టులు(విలువైన రాళ్ళను గుర్తించే వారు) ఉత్తమమైన కెంపు దానిమ్మ గింజ ఎరుపులో ఉండాలంటారు.మరి కొందరు ఇది తామర ఎరుపులో కూడా ఉంటుంది కనుక దీనిని సంస్కృతంలో 'పద్మరాజ' అంటారు.ఎరుపు అంటే  పావురాయి రక్తం ఎరుపులో ఉండి మెరుస్తూ నీలం తళుకులతో ఉంటుంది.
       ఇది మియన్మార్, థాయ్ లాండ్,మన దేశం,పాకిస్థాన్,అమెరికా, శ్రీ లంక మొదలైన దేశాల్లో నేలలో లభిస్తుంది ప్రత్యేక పద్ధతి ద్వారా భూమిలో దొరకిన రాయినుండి కెంపును వేరు చేస్తారు.
       మన ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణలలోకూడా లభిస్తోంది.కానీ అన్నిటికంటే మియన్మార్ లో లభించే అతి ఎర్రటి కెంపులే ఉత్తమమైనవిగా భావిస్తున్నారు!
       ఇది ధరిస్తే ఎంతో శక్తి వస్తుందని, శుభప్రదమని కొందరి నమ్మిక!
      వీటిలో కూడా నకిలీ కెంపులు ఉంటాయి.కొనేటప్పుడు నిపుణుల సలహా తీసుకుని కొనుక్కోవాలి.
       400 కారెట్ల బరువుగల కెంపును మియన్మార్ లో కనుగొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద కెంపు 650 కారెట్లు గల 'వైద్యరాజ్' అనే కెంపు.అతి పెద్ద కెంపు రాయి రూపంలో ఉన్నది అమెరికాలోని స్మిత్ సోనియన్ మ్యూజియంలో ఉంది! ఇంగ్లాండుకు చెందిన (18వ శతాబ్దం) రచయిత, భూగర్భ శాస్త్ర వేత్త  జాన్ రస్కిన్ "రూబి  అందమైన ఎర్రని రాయి,దానిని గురించి ఎంతో తెలుసుకోవాలి" అని వ్రాశాడు!
        తిరుమల వెంకటేశ్వరునికి కూడా కెంపుల హారం ఉంది. ఇది కెంపు లేక రూబీ చరిత్ర.
             *************

కామెంట్‌లు