హస్తకళలు ఒక పరిశీలన;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  మనదేశంలో హస్తకళలను పరిశీలిస్తే ప్రతి రాష్ట్రంలో,ఇంచుమించు ప్రతి జిల్లాలో ఏదో ఒక  ప్రత్యేకత సంతరించుకున్న హస్తకళాకారులు ఉన్నారు.మహంజోదారో,హరప్పా(క్రీ.పూ.3000) త్రవ్వకాల్లో కూడా కొన్ని హస్తకళాఖండాలు కనుగొన్నారు! మొగలులు,,మౌర్యులు,గుప్తులు హస్త కళలను పోషించిన దాఖలాలు ఉన్నాయి. మొగలు చక్రవర్తి బాబరు సూక్ష్మ చిత్రకళను(miniature art) ఎంతో ప్రోత్సహించాడు.ఇప్పుడు ఆ చిత్రాల్లో కొన్ని లండన్ లోని ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్నాయి.మన రాష్ట్రంలో కొండపల్లి బొమ్మలు,కలంకారి అద్దకం,ఏటికొప్పాక బొమ్మలు,తిరుపతిలో కొయ్య బొమ్మలు,కర్నూలు జిల్లా లోని ఆళ్ళగడ్డలో  శిల్ప తయారీ,తెలంగాణాలో వరంగల్ జిల్లాలో బిద్రి బొమ్మల తయారీ,నిర్మల్ లో కొయ్యబొమ్మల తయారీ ఇలా చాలా చెప్పొచ్చు. వీటికి కొంత మార్కెటింగ్ సౌకర్యం ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి.విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.
       కళాకారులకి తగినంత చేయూత, ముడిసరకు లభించేటట్టు ప్రభుత్వాలు చూడాలి.ఈ విషయాల్లో చైనా దీశం ముందుంది.అందుకే వారి బొమ్మలు, కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడు పోతున్నాయి.' లాఫింగ్ బుద్ధ'ఫెంగు షుయ్' వంటి కళాఖండాలు లభించని దేశంలేదు!
     మన కళాకారులు కూడా స్జనాత్మకతతో వారు చేసేవాటిల్లో కొత్తదనం తీసుకరావాలి, ఇది కొంతవరకు నిర్మల్ కళాఖండాల్లో చూడవచ్చు.కొండపల్లి బొమ్మలకు కూడా కొంత సృజనాత్మకతను జోడించడం హర్షదాయకం.
    మన హస్త కళలను విదేశాల్లో  ప్రదర్శించి విదేశీయులకు మన కళలమీద అవగాహన కలిగించాలి.
     దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళలమీద పరిశోధన పుస్తక ప్రచురణలు చేయాలి,ఈ కళల మీద కొన్ని పుస్తకాలు ఉన్నాయి.
      మనదేశంలోకీ॥శే॥ రుక్మిణీ అరండల్,కమలా దేవి ఛటోపాధ్యాయ,పపుల్ జయకర్ గ్రామ కళలు,హస్తకళల అభివృద్ధికి ఎంతో కృషిచేశారు.
        పెద్ద నగరాల్లో హస్తకళల మ్యూజియంలు ఏర్పాటు చేయాలి.హస్తకళల మీద సంక్షిప్త సమాచారం పొందుపరిస్తే ప్రజలకు,విదేశీయులకు అవగాహన కలుగుతుంది.పాతతరం కళలే కాకుండా ఈ మధ్య కొందరు కళాకారులు కొన్ని కళాఖండాలు సృష్టిస్తునారు. వారిని కూడా తగిన ప్రోత్సాహం అందించాలి.
       ఏదిఏమైనా ఈ కరోనా కష్టకాలంలో కళాకారులను ప్రోత్సహించడం వారి ఆదాయాన్ని పెంచడం అందరి కర్తవ్యం.
       **************

కామెంట్‌లు