సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com

 పుస్తకము
@ పుస్తకం అద్దం లాంటిది, కనుక అందులోకి గాడిద తొంగిచూస్తే అప్సరస ఎలా  కనబడుతుంది?  జి సి వి టెన్ బర్గ్
@ పుస్తకం గొప్పతనం దాని విషయం మీద ఆధారపడదు.అది అందించే ప్రేరణపై ఆధారపడి ఉంటుంది. 
@ పుస్తకం మంచి మిత్రుని వంటిది. ఎల్. జె. పీటర్
@ పుస్తకం మిత్రుడు, మంచి పుస్తకం మంచి మిత్రుడు.  నువ్వు మాట్లాడమంటే నోరు తెరుస్తుంది.  వద్దంటే నోరు మూసుకుంటుంది.  అలా ఉండే స్నేహితులు ఎంత మంది? అబ్బాట్ లిమాన్
@ పుస్తకం విలువను దాని ఖరీదుతో లెక్కకట్టకుండా అది ఇచ్చే జ్ఞానంతో వెలకట్టండి. గురునానక్
@ మంచి పుస్తకం ఒక మంచి నేస్తం, ఈనాడు గాని ఏనాటికైనా గాని స్థిరంగా ఉండే స్నేహం అదే. షేక్ స్పియర్

కామెంట్‌లు