సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com

 పుస్తకము
@మంచి పుస్తకం ఒక మంచి నేస్తం, ఈనాడు గాని ఏనాటికైనా గాని స్థిరంగా ఉండే స్నేహం అదే. షేక్ స్పియర్
@మంచి పుస్తకం చదవడం గడచిన శతాబ్దాలలోని ఉత్తములందరితో సంభాషణ జరిపినట్లు. రెనెడ్ స్కార్టిస్ట్
@మంచి పుస్తకం మన దగ్గర ఉంటే, మంచి మిత్రులు లేని లోటు ఉండదు. మహాత్మాగాంధీ
@మంచి పుస్తకం వంద మంది మిత్రులకు సమానం.మంచి మిత్రుడు గ్రంథాలయంతో సమానం అబ్దుల్ కలాం
@మంచి పుస్తకం విందు భోజనం వంటిది. కె. యల్.  జలనిస్కీ
@మంచి పుస్తకం విజ్ఞానాన్ని యిస్తుంది,  మంచి ఆలోచనలను రేకెత్తిస్తుంది. యన్. కె.  కృపసాయ
@మనిషి భగవంతుడు కావాలని రాసిఉంటే పుస్తకం అతని కిరీటం అవుతుంది.  ఆండ్రే నికొలవిచ్
@విషం తన ప్రభావాన్ని ఒకసారే చూపుతుంది.  కాని చెడ్డ పుస్తకం చాలా కాలం వరకు మనుషుల మనస్సులను విషమయం చేస్తూనే ఉంటుంది. 
@సరైన పుస్తకం చేతుల్లో ఉంటే.   మనం మంచి మార్గాన్ని ఎంచుకున్నట్లే.  అబ్దుల్ కలాం
@ సూక్తుల పుస్తకం చదవటం ఎవరికైనా మంచిదే. చర్చిల్

కామెంట్‌లు