సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com

 విజయం-
@ ఆచరించి చెప్పే మాటలకు ఆదరణ, ఇష్టంతో చేసే పనులకు విజయం తప్పక లభిస్తాయి. ఎమర్సన్
@ ఆత్మ విశ్వాసం సడలితే ఓటమి  ప్రారంభమైనట్లే.  అది సడలకుండా ఉన్నప్పుడు మాత్రమే  మనల్ని విజయం వరిస్తుంది. అబ్దుల్ కలాం
@ ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే, ఆత్మ విజయం పొందటమే అత్యుత్తమం.
@ ఇతరులను చూసి ఈర్ష్య పడే ఏ వ్యక్తీ గొప్ప విజయం సాధించలేడు. టాలీ రాండ్
@ ఇతరులపై విజయం సాధించేవారు బలవంతులు, తమని తాము గెలిచేవారు ఉన్నతులు. 

కామెంట్‌లు