సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414. peddissrgnt@gmail.com
 ❖మాటకుమాట, నీటికి నాచు తెగులు. ❖ముసలివాళ్ళ మాట ముళ్ళు లేని బాట.
❖మూట పోతే పోయింది మాట పోరాదు. ❖ మనిషి సంగతి మాట చెపుతుంది.
❖మృదువైన మాట కోపాన్ని చల్లార్చుతుంది.   నొప్పించే మాట క్రోధాన్ని రేపుతుంది. 
❖రాజు మెచ్చింది మాట. ❖ వేటుకు వేటు, మాటకు మాట.
❖వచ్చీరాని మాట ఊరీ ఊరని ఊరగాయ రుచి.❖ వచ్చీరాని మాట వరహాల మూట.
❖విన్న మాట కంటే చెప్పుడు మాట చేటు. ❖ వీలెరిగి మాట ,  కీలెరిగి వాత.
❖వేలాది వ్యర్థమాటలు వినేకన్నా శాంతిని, క్రాంతిని ప్రసాదించే మంచిమాట ఒకటి చాలు. బుద్ధుడు
❖సామెతల మాట, విందు వినోదాల పొందు. ❖ సామెతలేని మాట, ఆమెత లేని ఇల్లు.


కామెంట్‌లు