కర్పూర నీరాజనం (కవిత);-గుర్రాల లక్ష్మారెడ్డి., కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
అదిగో అల్లదిగో చూడు
ఇదిగో మళ్ళిదిగో నేడు
వచ్చే నవంబరు ఫస్టు
తెచ్చాను సంబరాల బెస్టు!

ముక్తకంఠంతో జైజై కొట్టి
భక్తిభావంతో ప్రతిన బట్టి
సైఅంటూ పతాకాలుపట్టి
ఫైమింటికి ఇక ఎగురవేయి !

అమరజీవి శ్రీ రాములు పొట్టి
అమల ఆశయాన్ని తా చేపట్టి
ఆంధ్ర రాష్ట్ర అవతరణకు గట్టి
అంకురార్పణ చేసే ప్రతిన బట్టి !

ఆరిపోని దీపంతాను వెలిగించి
మారిపోని రూపంమాకు మిగిల్చి
మము విడిచి వెళ్ళావా మహాత్మా
నిన్ను విడిచి ఉండదులే మాఆత్మ!

మా మెదడు దడి క్రింద దాక్కున్న
మీ జ్ఞాపకాల భావ చిత్ర పరిమళాలు
కిమ్మీర కిర్మీర కర పుష్పాలై నేడు
కిలకిల గల గల నవ్వుతున్నాయి చూడు

అందరి మా ఆంధ్రుల జాతకాల మార్చి
సుందర  సుమ చంద్రిక తీరాలకు చేర్చి
నందన నవ చందన హారాలను గూర్చి
అలంకరించారు ఆంధ్ర లక్ష్మి గల మందు పేర్చి!

తెలుగు ఆంధ్రము కలిసినాయి
వెలుగు వానలు కురిసినాయి
ఆంధ్ర ప్రజల డెంధముల యందు
ఆంధ్ర లక్ష్మి వేసింది అందాల చిందు 

ఆమరణ నిరాహార దీక్షను చేపట్టి
అమరజీవి అయిన ఆ జగజెట్టికి
అర్పిస్తున్నాం అక్షర తర్పణ తోరణం
సమర్పిస్తున్నాం మా సవాలక్ష కర్పూర నీరాజనం !


కామెంట్‌లు