పల్లెటూరి పిల్లలం (బాల గేయం);-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
పల్లెటూరు పిల్లలం
బలాదూరు మల్లెలం
ఇల్లు ఇల్లు తిరుగుతాం
మల్లెపూలు అమ్ముతాం !

పల్లెతల్లి నీడలో పెరిగినం
అల్లిబిల్లి వాడల్లో తిరిగినం 
అందరితో ఉందిసహవాసం
లేదు మాకంటూ ఓ నివాసం!

పావులాకు జానెడు మేం ఇస్తూ
ముప్పావులకు మూరెడు వేస్తూ
కొలుస్తూనే అందరికీ అమ్ముతాం
గునుస్తే మేం బుట్టలోన కమ్ముతాం 

మేం పల్లెటూరి పోరలమని
మా పట్టులేని వారమనికని
అసలు మీరు అనుకోనేవద్దు
సిసలు తెలుసుకుంటే ముద్దు !

పూలతోటకి వెళ్ళుతాం ప్రతినిత్యం
పూలమాలలల్లుతాం ఇది సత్యం
మా దేవుని మెడలో మొదటి మాల
మేం వేసి పూజిస్తాంమా సంధ్యవేళ

మిగిలిన మాలలన్నిఇకమేం తెస్తాం
కూడలిలో పెట్టి వాటిని అమ్మేస్తాం
వచ్చిన సొమ్మునంతా జమచేస్తాం
 నచ్చిన సరుకు నంత కొనివేస్తాం !


కామెంట్‌లు