ఈ సమస్త విశ్వం శివలింగ స్వరూపం;-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
 లోకం లింగాత్మకం అని ఆగమ శాస్త్రం బోధిస్తున్నది. ఈ జగమంతా శివమయం అనుటకు ఈ క్రింది కొన్నింటిని మనం నిత్యం జాగ్రత్తగా గమనిస్తే మనకు విషయం అవగాహన అవుతుంది.
1). మానవుని శిరస్సు.....,.... ప్రతి మానవుడి శిరస్సు లింగరూపంలో ఉంటుంది. శిరస్సును లింగ మైతే మొండెము పానవట్టము.రెండు సమన్వయం శివ శక్త్యా త్మక స్వరూపమే మానవుడు అన్నమాట.
2). దీప జ్వాల........ దీపం శివలింగ స్వరూపం లో వెలుగుతుంది. దీపం " ఆరా"ను గమనిస్తే దీపం శివలింగ స్వరూపం లో మనకు గోచరిస్తుంది.
3). పర్వతాలు........ పర్వతము లన్నియు శివలింగ స్వరూపంలోనే ఈ భూమిపైన ఏర్పడ్డాయి. శిల్పి చెక్కిన విధముగా సహజ లింగ స్వరూపం లోనే ఉంటాయి.
4). కొండలు........ కొండ లన్నియు కూడా శివలింగ స్వరూపం లోనే ఈ భూమిపై ఏర్పడ్డాయి.
5). పక్షుల గుడ్లు......... పక్షులు పెట్టిన గుడ్లు అన్నియు లింగ స్వరూపం లోనే ఉంటాయి. గుడ్డు నుండి పక్షిపిల్ల రావడం శివలింగం నుండి విశ్వం ఆవిర్భవించిన ట్లుగా మనకు కనిపిస్తుంది.
6). విత్తనములు........ అన్ని రకాల విత్తనములు శివలింగ స్వరూపం లోనే ఉంటాయి. తనము నుండి వృక్షం ఆవిర్భవించిన శివలింగం నుండి ఈ జగత్తు ఆవిర్భవించడాన్ని సూచిస్తుంది.
7). గుట్టలు........ ఈ భూమిపై ఉన్న గుట్టలను పరిశీలిస్తే ఆ గుట్ట లన్నియు శివలింగ స్వరూపం లోనే ఉన్నట్లు మనకు గోచరిస్తున్నాయి.
8). భరత ఖండం...... మన భరత ఖండాన్ని జంబుద్వీపం అని అంటారు . జై జంబుద్వీపంను మనం గమనిస్తే శివలింగ స్వరూపం లోనే మనకు కనిపిస్తుంది.
పైన సూచించిన ఉదాహరణలు గమనిస్తే ఈ జగమంతా శివలింగ స్వరూపమే అని మనకు తెలుస్తున్నది. ఇది సత్యము.

కామెంట్‌లు