"ప్రముఖవిద్యావేత్త మాన్యశ్రీచుక్కారామయ్యగారి 96 వ జన్మదినం-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
కం.
చుక్కారామయ్యయితడు
లెక్కలశాస్త్రమ్మునందులీలలుజూపెన్
మిక్కిలివిద్యార్థులకును
చక్కగబోధించిపట్టుసాధించెనుగా!!!

02.
కం.
"ఐఐటీరామయ్యగ"
"ఐఐటీశిక్షకులకుహైద్రాబాదున్"
"ఐఐటీస్థాపించియు"
"ఐఐటీశ్రేణులెన్నొయందించెనుగా"!!!

03.
కం.
గణితముతనజీవితమని
గణితముతోఆటలాడెగణనీయముగన్
గణితమునాదైవంబని
గణితపుపరిశోధనలకుగరిమనుపెంచెన్!!!

04.
కం.
విద్యాదేవికిరత్నము
విద్యాఅభివృద్ధికొరకువిలువగురచనల్
విద్యార్థులకందించియు
విద్యావేత్తగప్రసిద్ధివిజయమునొందెన్!!!

05.
కం.
శాసనమండలిసభ్యుడు
చేసెనునిస్వార్థరహితసేవలనెన్నో
వాసిగతెలగాణముకై
వేసెనుబాటలుప్రగతికివిజ్ఞతతోడన్!!!


కామెంట్‌లు