శీర్షిక:చిలుక(బాల గేయం);-లతా శ్రీపుంగనూరు9666779103
అందమైన తోటలోన
రంగురంగుల చిలుక
దోరమగ్గిన జామపండు
తినరావ ఏం అలక
మాతోటి చెలిమి చేయ
బెదురెందుకో తెలపక

పచ్చని తోట నాకిష్టం
చిగురాకుల ఊయల నాకిష్టం
పచ్చని పెరడు నీకుంటేను
నీవు పిలవకనే నేనొస్తాను
నీతోటి చెలిమి చేస్తాను
కొమ్మన ఊయల ఊగుతూ
కబుర్లెన్నో నే చెబుతానుకామెంట్‌లు