ఓ మనిషీ! మారాలి నీవు;-డా.టి.రాధాకృష్ణమాచార్యులు9849305871
నీ పాదాల నడకలో వెలుగులు ఉన్నాయి  
ఆక్సిజన్ అందిన మనసులో జీవం పలికింది
అందమైన పదాలన్నీ పదునుదేరి ఉన్నాయి కత్తిలా
మెత్తని పెదవుల కోసింది గడ్డి పరక రంపమే

తియ్యగా ఊరించే బెల్లం గడ్డ
తిన్నగా తాకింది దేహాన్ని 
మనిషిని మాయజేసి నిజాన్ని మలిన పరిచింది
బహుశా మెదడుకు మత్తు మందు ప్రయోగించిందేమో!

జీవితమంటే డబ్బూ దస్కమని తలచింది మనిషి 
గీసిన వృత్తంలో బందీ పరుగులన్నీ
ధనం ఓ మాయ మందే ఇక్కడ
మనిషికి పట్టిన గ్రహణం

మనిషి  విలువల సరళ రేఖను విడిచిండు గమనంలో
మట్టిలో కూరుకుని పాతాళానికి జారి మాయమైండు

సుందర స్వప్నాలు మనిషిలో అయోమయం
మనిషి ఊసుల ఊపిరిలో డబ్బు ప్రతిబింబమైంది అర్థం అద్దంలో 
ఆబ ఆబగా చేసింది మనిషి బతుకు 

దేశమంటే మనుషులేననే గురజాడ
నా దేశం  బలం మనిషి నడకే

కవిత్వం అందమైన మాటలు కాదు
అనివార్యంగా తాకే సెగల సోయగం
ఓ మనిషీ మారాలి నీవు 
దార్శనికత చూపిన మనీషిలా వెలుగు


కామెంట్‌లు